బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగులుతోంది. గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.1,800 పెరిగింది. ఏకంగా 10 గ్రాముల బంగారం రూ.41,000 మార్క్ దాటింది. సోమవారం రోజు ఏడేళ్ల గరిష్ఠానికి బంగారం ధర చేరుకుంది. పెరుగుతున్న బంగారం ధరలు గోల్డ్ కొనాలనుకునేవారిలో దడ పుట్టిస్తోంది. సోమవారం ఉదయం 9.20 గంటలకు సరికొత్త రికార్డుల్ని సృష్టించింది బంగారం. ఏకంగా రూ.41,073 ధరతో ట్రేడ్ మొదలైంది. సోమవారం రోజే 10 గ్రాము బంగారం 2.3 శాతం అంటే రూ.955 పెరిగింది. రూ.41,067 ధరకు చేరుకుంది. జనవరి 3న ఇరానియన్ టాప్ కమాండర్‌ను అమెరికా హతమార్చిన రోజు కూడా బంగారం ధర 2 శాతం పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.41,780 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,330. న్యూ ఢిల్లీలో కేజీ వెండి ధర రూ947 పెరిగి రూ.48,474 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.50,000 మార్క్ దాటింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.51.000.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధర పెరిగినట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరానియన్ మిలిటరీ కమాండర్‌ను అమెరికా హతమార్చడం, ఆ తర్వాత పరిణామాలతో బంగారం ధర పరుగులు తీస్తోంది. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. ఏకంగా 1.7 శాతం పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,577.98 డాలర్లు. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 18.45 డాలర్లు. మరోవైపు చమురు ధరలు కూడా పెరుగుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.72 దిగువకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Save Money: నెలకు రూ.5,000 పొదుపు... మీ అకౌంట్లో రూ.1 కోటి రిటర్న్స్... పొందండి ఇలా
Tirupati Package: తిరుపతి వెళ్తున్నారా? స్థానిక ఆలయాలు చూసేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీPublished by:Santhosh Kumar S
First published:January 06, 2020, 12:51 IST