కరోనా దెబ్బకు... వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. అటు ప్రపంచ మార్కెట్లన్నీ బేర్ మనడంతో తులం యాభై వేల రూపాయలకు చేరుకునేలా పరుగులు పెట్టిన బంగారం ధర... ఇప్పడు వెనక్కు తగ్గింది. గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో... దేశీ మార్కెట్లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ. 534 తగ్గి రూ. 39,710 కు చేరింది. ఇక మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 534 పతనమై రూ.34,882కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1500 డాలర్లకు దిగివచ్చింది. తాజాగా అమెరికాలో ఔన్సు బంగారం ధర 1482 డాలర్లుగా నమోదు అయ్యింది. దీంతో బంగారం ధరలు దేశీయంగా కూడా దిగివచ్చాయి. అటు హైదరాబాద్ లో బంగారం ధర మేలిమి బంగారం 10 గ్రాముల ధర 41870గా నమోదు అయ్యింది. అలాగే 22 కేరట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.38730 గా నమోదు కాగా, విజయవాడలో రూ. 39000, విశాఖపట్నం రూ.39000, ప్రొద్దుటూరు రూ. 38800, చెన్నై రూ.38680 గా నమోదు అయ్యింది. వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.35 వేలుగా నమెదు అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewell, Gold price down, Gold rate hyderabad, Gold rates