news18-telugu
Updated: October 25, 2019, 11:48 AM IST
Gold Price: ధంతేరస్, దీపావళికి బంగారం కొంటున్నారా? లేటెస్ట్ రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం అమ్మకాలు ఊపందుకునే సీజన్ ఇది. లక్ష్మీదేవిని కొలిచే దీపావళి పండుగ కావడం, అంతకంటే ముందే ధంతేరస్ రోజున బంగారం కొంటే ఇంటికి లక్ష్మి వస్తుందన్న నమ్మకంతో దీపావళి సీజన్లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. శనివారం ధంతేరస్, ఆదివారం నరకచతుర్దశి, దీపావళి కావడంతో నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. గత నెలతో పోలిస్తే బంగారం ధరలు బాగా తగ్గాయి. నెల రోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.2000 తగ్గింది. అందుకే ఈ దీపావళి సీజన్లో బంగారం అమ్మకాలు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. ధర కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగితే శుక్రవారం ధర రూ.23 తగ్గడం విశేషం.
ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే న్యూ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.38,329. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.39980 కాగా, 22 క్యారెట్ ధర రూ.36650. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్స్ బంగారం ధర 1,504.35 డాలర్లు. న్యూ ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.46,127 కాగా హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.48770. అంచనాలకు తగ్గట్టుగానే ధంతేరస్ పండుగకు ఒకరోజు ముందు బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. మరి ధంతేరస్, దీపావళి రోజున గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో చూడాలి.
Redmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Dhanteras 2019: ధంతేరాస్‌కు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలాDiwali Gift: దీపావళికి గిఫ్ట్ తీసుకుంటున్నారా? మీరు కట్టాల్సిన ట్యాక్సులు ఇవే...
Published by:
Santhosh Kumar S
First published:
October 25, 2019, 11:48 AM IST