Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర

Gold Price Today | హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.36,500 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,310. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర స్థిరంగా ఉంది.

news18-telugu
Updated: July 29, 2019, 5:59 PM IST
Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర
Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 29, 2019, 5:59 PM IST
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శనివారం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.40 పెరిగితే సోమవారం రూ.50 తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,720 కాగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,550. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.36,500 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,310. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర స్థిరంగా ఉంది. ప్రస్తుత ధర రూ.27,500. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ గోల్డ్ ధర 1,419.40 డాలర్లు. నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గింది.

వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.41,900 ధరకు చేరుకుంది. 100 వెండి నాణేలపై రూ.1000 తగ్గింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.84,000 కాగా, అమ్మకం ధర రూ.85,000. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర స్వల్పంగా పడిపోయిందని మార్కెట్ వర్గాల సమాచారం. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 16.44 డాలర్లు.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...