Gold Price Today: వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్

Gold Rate Today | బంగారం కొనాలనుకుంటున్నారా? మూడు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ బంగారం, వెండి రేట్లు తెలుసుకోండి.

news18-telugu
Updated: April 1, 2020, 6:18 PM IST
Gold Price Today: వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్
Gold Price Today: వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనలానుకునేవారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. వరుసగా మూడు రోజు కూడా గోల్డ్ రేట్ దిగిరావడం పసిడిప్రేమికులకు ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ.70 తగ్గి రూ.39,440 ధరకు చేరుకుంది. 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.80 తగ్గి రూ.43,080 ధరకు చేరుకుంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.40,940 కాగా, 24 క్యారెట్ ధర రూ.43,210. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,592.83 డాలర్లు.

బంగారం ధరలు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల డిమాండ్ తక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో కూడా బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. బంగారం ధరలు తగ్గితే వెండి రేటు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో, ఢిల్లీలో కేజీ వెండిపై రూ.460 పెరిగింది. ప్రస్తుత ధర రూ.39,940.

ఇవి కూడా చదవండి:

SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా



EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే
First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading