బంగారం కొనలానుకునేవారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. వరుసగా మూడు రోజు కూడా గోల్డ్ రేట్ దిగిరావడం పసిడిప్రేమికులకు ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ.70 తగ్గి రూ.39,440 ధరకు చేరుకుంది. 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.80 తగ్గి రూ.43,080 ధరకు చేరుకుంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.40,940 కాగా, 24 క్యారెట్ ధర రూ.43,210. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,592.83 డాలర్లు.
బంగారం ధరలు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల డిమాండ్ తక్కువగా ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో కూడా బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. బంగారం ధరలు తగ్గితే వెండి రేటు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో, ఢిల్లీలో కేజీ వెండిపై రూ.460 పెరిగింది. ప్రస్తుత ధర రూ.39,940.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.