• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE FALLS THIRD DAY IN A ROW IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price: వరుసగా మూడో రోజు భారీగా పడిపోయిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price: వరుసగా మూడో రోజు భారీగా పడిపోయిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | పెరుగుతుందనుకున్న బంగారం ధర రివర్స్ అవుతోంది. గోల్డ్ రేట్ రోజురోజుకీ దిగొస్తుంది. హైదరాబాద్‌లో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎంతో తెలుసుకోండి.

  • Share this:
    బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ భారీగా తగ్గుతోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గడం విశేషం. మూడు రోజుల్లో గోల్డ్ రేట్ రూ.2,000 పైనే తగ్గింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.1,330 తగ్గగా, 22 క్యారట్ బంగారం ధర రూ.1,120 తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.43,850 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.40,200. న్యూ ఢిల్లీలోనూ బంగారం ధర భారీగా తగ్గడం విశేషం. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.1,097 తగ్గి రూ.42,600 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,584 డాలర్లు. బంగారం మాత్రమే కాదు... వెండి ధర కూడా పడిపోతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.370 తగ్గి రూ.48,030 ధరకు చేరుకోగా, న్యూ ఢిల్లీలో రూ.1,574 తగ్గి రూ.44,130 దగ్గర ఆగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.65 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడింది.

    సాధారణంగా మార్కెట్లు క్రాష్ అయినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి అయిన బంగారంవైపు మొగ్గుచూపుతుంటారు. అందుకే మార్కెట్లు పడ్డప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. కానీ ఈసారి ఇన్వెస్టర్లు బంగారంపై కాకుండా ఇతర పెట్టుబడులపై దృష్టిపెట్టడంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గింది. ఫలితంగా గోల్డ్ రేట్లు మూడు రోజులుగా తగ్గుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇకపై కూడా బంగారం ధర తగ్గే అవకాశాలున్నాయి.

    ఇవి కూడా చదవండి:

    SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...

    Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు

    Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్
    Published by:Santhosh Kumar S
    First published: