బంగారం ధర దిగొస్తోంది. గతవారం వరుసగా నాలుగు రోజులు బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో 10 గ్రాముల బంగారం రూ.47,327 రికార్డ్ ధరను కూడా తాకింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. గతవారం రూ.47,000 వైపు దూసుకెళ్లింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో మళ్లీ రికార్డు ధర ఖాయమనుకున్నారు. కానీ రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. సోమవారం లాగానే మంగళవారం కూడా గోల్డ్ రేట్ తగ్గడం విశేషం. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.58 శాతం అంటే రూ.266 తగ్గి రూ.46,000 దిగువకు చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రూ.45,925 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం ధర వరుసగా మూడో రోజు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,702 డాలర్లు. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కేజీపై 0.97 శాతం అంటే రూ.407 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.03 డాలర్లు. ఇక హైదరాబాద్‌లో చూస్తే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.500 తగ్గింది. ప్రస్తుత ధర రూ.44,240. మరోవైపు 24 క్యారట్ బంగారం రేటు స్వల్పంగా పెరిగి రూ.46,910 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.41,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో బంగారం డిమాండ్ తగ్గిపోవడం వల్ల ధరలు తగ్గుతున్నాయని అంచనా.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
Prepaid Plans: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates