Gold Price Today: 6 రోజుల్లో రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇవాళ్టి ధరలివే

Gold Rate Hyderabad | స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు... బంగారం ధరలు కూడా పతనమవుతున్నాయి. 6 రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 17, 2020, 5:09 PM IST
Gold Price Today: 6 రోజుల్లో రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇవాళ్టి ధరలివే
Gold Price Today: 6 రోజుల్లో రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇవాళ్టి ధరలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్. భారీగా పెరుగుతుందనుకున్న గోల్డ్ రేట్ దిగొస్తోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న గోల్డ్ రేట్ న్యూ ఢిల్లీలో రూ.40,000 దిగి రావడం విశేషం. న్యూ ఢిల్లీలో బంగారం ధర 6 రోజుల్లో ఏకంగా రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ రేట్ తగ్గుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్క రోజే 10 గ్రాములపై ఏకంగా రూ.920 తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.42,300 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,700. న్యూఢిల్లీలో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.80 తగ్గి రూ.39,719 ధరకు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,483 డాలర్లు.

మరోవైపు వెండి ధర కూడా తగ్గుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.41,780. న్యూ ఢిల్లీలో కూడా సిల్వర్ రేట్ భారీగా తగ్గింది. కేజీపై రూ.734 తగ్గడంతో రూ.35,948 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర 12.53 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు బలపడింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ బలహీనంగా ఉండటం వల్లే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈక్విటీలో నష్టపోయిన ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి లాభాలు పొందేందుకు పోటీపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో కారణమని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి

SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...
First published: March 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading