సరిగ్గా నాలుగు నెలల క్రితం బంగారం ధరలు చూసి వామ్మో అనుకున్నారు. సామాన్యులకు అందనంత స్థాయిలో బంగారం రేటు దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ చూస్తే రికార్డు ధర నుంచి భారీగా పతనమైంది. ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం ధర ఇంత దారుణంగా పడిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు. నాలుగు నెలల్లో గోల్డ్ రేట్ ఏకంగా రూ.7,500 పతనమైంది. అంటే ఆగస్టులో గరిష్ట స్థాయిలో గోల్డ్ కొన్నవారికి 10 గ్రాములపై రూ.7,500 నష్టం వచ్చినట్టే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గోల్డ్ ర్యాలీ ఆగస్ట్ 7 వరకు కొనసాగింది. అక్కడ్నుంచి గోల్డ్ రేట్ పతనం మొదలైంది. హైదరాబాద్ మార్కెట్లో 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఆగస్ట్ 7న రూ.54,200 దగ్గర ట్రేడ్ అయింది. ప్రస్తుతం ఇదే గోల్డ్ ధర రూ.46,700. అంటే నాలుగు నెలల్లో రూ.7,500 తగ్గింది.
Gold: మార్కెట్ రేట్ కన్నా తక్కువకే బంగారం... రేపటి నుంచి సేల్
PMSYM Scheme: మీ జీతం రూ.15,000 లోపేనా? ఈ పెన్షన్ స్కీమ్ మీకోసమే
మరోవైపు స్వచ్ఛమైన బంగారం ధరలు చూస్తే ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో 24క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ రేట్ చూస్తే రూ.50,940. అంటే స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు నాలుగు నెలల్లో రూ.8,190 తగ్గింది. రికార్డ్ ధరలు చూసి ఖంగుతిన్నవారికి భారీగా తగ్గుతున్న బంగారం రేటు ఊరటనిచ్చినట్టే. మొత్తంగా చూస్తే ఈ ఏడాది గోల్డ్ 25 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. బంగారం మాత్రమే కాదు వెండి ధర కూడా రికార్డ్ స్థాయి నుంచి దిగొచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు భారీగా తగ్గిన వెండి ఇటీవల కాస్త పెరిగింది. అయినా రికార్డు ధర నుంచి తక్కువకే వెండి దొరుకుతోంది. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.76,510 వరకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.71,200. రికార్డు స్థాయి నుంచి రూ.5,310 ధర తగ్గింది.
Aadhaar PVC Card: ఏటీఎం కార్డు సైజులో ఆధార్ కార్డ్... ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోండి ఇలా
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు
బంగారం ధరలు ఈస్థాయిలో తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. దీంతో అప్పటివరకు బంగారాన్ని సురక్షిత పెట్టుడిగా భావించిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్లకు మళ్లించారు. దీంతో పాటు కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించి పాజిటీవ్ వార్తలు రావడంతో వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందన్న ఆశలు పెరిగాయి. దీంతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గడంతో రేటు కూడా తగ్గింది. మరి గోల్డ్ రేట్ భవిష్యత్తులో పెరుగుతుందా? తగ్గుతుందా? 2021 లో గోల్డ్ రేట్ పరిస్థితి ఏంటి? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. అయితే దీర్ఘకాలంలో గోల్డ్ మంచి రిటర్న్స్ ఇస్తుందని చరిత్ర చెబుతోంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకునేవారు గోల్డ్ తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది.
Published by:Santhosh Kumar S
First published:December 27, 2020, 11:20 IST