Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర

Gold Price Today | నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం, గ్లోబల్ ట్రెండ్‌ బలహీనంగా ఉండటమే బంగారం ధర తగ్గడానికి కారణమంటున్నారు ట్రేడర్స్.

news18-telugu
Updated: July 17, 2019, 6:18 PM IST
Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర
Gold Price: గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 17, 2019, 6:18 PM IST
బంగారం ధర మళ్లీ తగ్గింది. కొన్ని రోజులుగా బంగారం ధర ఊగిసలాడుతోంది. ఒకరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతోంది గోల్డ్ రేట్. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గితే, మంగళవారం రూ.100 పెరిగింది. బుధవారం బంగారం ధర రూ.70 తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,500 కాగా 99.5% స్వచ్ఛతగల బంగారం ధర రూ.35,330. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.35,980 కాగా, 22 క్యారెట్ ధర రూ.33,010. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,400. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,402.80 డాలర్లు. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం, గ్లోబల్ ట్రెండ్‌ బలహీనంగా ఉండటమే బంగారం ధర తగ్గడానికి కారణమంటున్నారు ట్రేడర్స్.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.660 పెరిగి రూ.40 వేల మార్క్‌ దాటింది. ప్రస్తుతం కిలో న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.40,190 కాగా, హైదరాబాద్‌లో రూ.41,165. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.65 డాలర్లు.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి...




ఇవి కూడా చదవండి:

Video: అక్కడ విమానం ల్యాండింగ్ చూస్తే వణికిపోవాల్సిందే

FASTags: హైవేపై వెళ్తున్నారా? ఇక 'ఫాస్ట్‌ట్యాగ్' తప్పనిసరి

Gold Phone: స్వచ్ఛమైన బంగారం, వజ్రాలతో స్మార్ట్‌ఫోన్... ధర రూ.4,80,000
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...