హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే

Gold Price Today
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.

బంగారం కొనాలనుకునేవారికి మరో గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ గురువారం కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.520 తగ్గడం విశేషం. రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న బంగారం ధర ప్రస్తుతం రూ.45,000 దగ్గర్లోనే ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.45,180 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.41,320. ఇక న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.128 తగ్గి రూ.44,490 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,645 డాలర్లు. మరోవైపు వెండి ధర కూడా తగ్గుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.48,400 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.302 తగ్గి రూ.47,170 దగ్గర ఆగింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ఔన్స్ వెండి ధర 16.73 డాలర్లు.

ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 53 పైసలు బలహీనపడింది. ఓవైపు రూపాయి విలువ క్షీణించినా బంగారం ధర మాత్రం తగ్గడం విశేషం. రాత్రికి రాత్రి అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనం కావడం వల్ల ఇండియాలో కూడా గోల్డ్ రేట్ తగ్గినట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నా... భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న వాదన వినిపిస్తోంది. అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు రూ.50,000 వరకు చేరొచ్చన్న అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... గుర్తుంచుకోండి

SBI News: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే

Save Money: కోటీశ్వరులు కావాలా? ఈ జపనీస్ టెక్నిక్ ట్రై చేయండి

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates

ఉత్తమ కథలు