GOLD PRICE FALLS RS 5000 AND SILVER DOWN RS 10000 IN AUGUST KNOW LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD SS
Gold Price: రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇప్పుడు కొనొచ్చా?
Gold Price: రూ.5,000 తగ్గిన గోల్డ్ రేట్... ఇప్పుడు కొనొచ్చా?
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Price | ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు అదే స్థాయిలో దిగొస్తున్నాయి. ఆగస్టులో భారీగా బంగారం ధరలు తగ్గాయి. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో, హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఆగస్టులో బంగారం ధర భారీగా దగ్గింది. ఆగస్టులో గరిష్ట ధరతో పోలిస్తే ఇప్పుడు రూ.5,000 తక్కువకే బంగారం కొనొచ్చు. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే ఆగస్ట్ 1న 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.51,780 కాగా, 24 క్యారట్ బంగారం ధర రూ.56,490 దగ్గర ఉండేది. కానీ వారం రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఆగస్ట్ 7న 22 క్యారట్ బంగారం రూ.54,200 ధరకు, 24 క్యారట్ బంగారం రూ.59,130 ధరకు చేరుకుంది. ఓ దశలో బంగారం రూ.75,000 ధరకు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ ఆగస్ట్ 7 నుంచి బంగారం ధర భారీగా తగ్గడం పసిడిప్రేమికులకు శుభవార్త. ఆగస్ట్ 7 నాటి గరిష్ట ధరలతో పోలిస్తే బంగారం ప్రస్తుతం రూ.5,000 తక్కువకే లభిస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారట్ 10 గ్రాముల ధర రూ.49,140 కాగా, 24 క్యారట్ 10 గ్రాముల ధర రూ.53,600. అంటే ఆగస్ట్ 7న ఉన్న ధరల కన్నా రూ.5,000 తక్కువలో బంగారం ధర ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. ఆగస్ట్ 1న కిలో కిలో వెండి ధర రూ.65,110 ఉంది. కానీ ఆగస్ట్ 7 నాటికి వారం రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరిగింది. ఆగస్ట్ 7న కిలో కిలో వెండి ధర రూ.76,510. ఇటీవల వెండి ధర భారీగా తగ్గింది. కిలోపై సుమారు రూ.10,000 తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,370. అంటే ఆగస్టులో గరిష్ట ధరతో పోలిస్తే ఇప్పుడు రూ.10,000 తక్కువకే వెండి కొనొచ్చు.
ఇక మల్టీకమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం వెండి ధరలు చూస్తే ప్రస్తుతం గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.51,736. ఆగస్ట్ 7న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,191. ఎంసీఎక్స్‌లో కూడా బంగారం ధర సుమారు రూ.4,500 తగ్గింది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కేజీ ధర రూ.67,350. ఆగస్ట్ 7న ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.77,949 ధరకు చేరుకుంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కిలో వెండి రూ.10,000 తక్కువగా ట్రేడ్ అవుతోంది.
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆగస్టులో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గుతున్నాయి. అయితే ఇలా తగ్గుముఖం పడుతున్న రేట్లు ఎక్కడ ఆగుతాయో, ఎంతవరకు తగ్గుతాయో, మళ్లీ పెరుగుతాయా అన్నది అంచనా వేయడం కష్టం. అందుకే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్దికొద్దిగా కొనడం మంచిది. దీని వల్ల ధర యావరేజ్ అవుతుంది. ఒకవేళ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కొనాలన్నా ఇదే స్ట్రాటజీ ఫాలో కావాలి.
ఇక ఆర్బీఐ 2020-21 సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ 6వ, ఆఖరి సబ్స్క్రిప్షన్ అమ్మకాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 4 వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ ఒక గ్రాముకు రూ.5,117 ధర ఫిక్స్ చేసింది ఆర్బీఐ. ఆన్లైన్లో కొంటే రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 1 గ్రాము బంగారాన్ని రూ.5,067 ధరకే కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.