news18-telugu
Updated: April 30, 2020, 5:13 PM IST
Gold Price Today: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర
(ప్రతీకాత్మక చిత్రం)
పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది. గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లో బంగారం ధర సుమారు రూ.500 దిగొచ్చింది. బుధవారం రూ.47,000 మార్క్‌ను తాకిన బంగారం ధర పడిపోయింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.490 తగ్గి రూ.46,700 ధరకు చేరుకుంది. 22 క్యారట్ బంగారం ధర రూ.470 తగ్గి రూ.43,950 ధరకు చేరుకుంది. బంగారం ధర భారీగా తగ్గితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా రూ.1,000 పెరగడం విశేషం. కిలో వెండిపై రూ.1,010 పెరిగి రూ.42,520 ధరకు చేరుకుంది. బంగారం ధరలు ఏప్రిల్‌లో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే నెలలో 10 గ్రాముల బంగారం గరిష్ట రికార్డు ధర రూ.47,000 దాటింది.
ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు పెరగడం విశేషం. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.31 శాతం అంటే రూ.143 పెరిగి రూ.45,689 ధరకు చేరుకుంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ 1.10 శాతం అంటే రూ.460 పెరిగి రూ.42,235 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్స్ బంగారం ధర 1,710 డాలర్లు. ఔన్స్ వెండి ధర 15.71 డాలర్లు.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్లైన్లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి... ఏ బ్యాంకులో ఎంతంటే
Published by:
Santhosh Kumar S
First published:
April 30, 2020, 5:11 PM IST