Gold Price Today: మూడు రోజుల్లో రూ.4,000 తగ్గిన గోల్డ్ రేట్... పసిడి మరింత పతనం అవుతుందా?

Gold Price Today: మూడు రోజుల్లో రూ.4,000 తగ్గిన గోల్డ్ రేట్... పసిడి మరింత పతనం అవుతుందా? (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today | బంగారం ధర మరింత పతనం అవుతుందా? రూ.50,000 కన్నా తక్కువ ధరకు దిగొస్తుందా? బంగారం ధరలు తగ్గడానికి కరోనా వ్యాక్సిన్ కారణమా? ప్రస్తుతం ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.

 • Share this:
  చుక్కల్ని తాకుతుందనుకున్న బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఏ స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయో అంతే స్పీడ్‌తో ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో చూస్తే మూడు రోజుల్లో బంగారం ధర రూ.4,000 తగ్గితే, వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గింది. దేశీయ మార్కెట్‌లో మాత్రమే కాదు... మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో కూడా బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. రెండు రోజుల్లో గోల్డ్ రేట్ రూ.2,000 వరకు తగ్గగా, వెండి రేటు రూ.6,000 పడిపోయింది. బంగారం, వెండి ధరలు ఇలా ఒక్కసారిగా పడిపోవడానికి కారణం కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు పెరుగుతుండటమే. రష్యాలో కరోనా వ్యాక్సిన్ విడుదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై ఆశలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడి లాభాలను బుక్ చేసుకుంటున్నారు.

  Loan: మీరు చిరు వ్యాపారులా? మోదీ ప్రభుత్వం లోన్ ఇస్తున్న లోన్‌కు అప్లై చేయండిలా

  Personal Loan: క్రెడిట్ స్కోర్ తక్కువున్నా... లోన్ తీసుకోవచ్చు ఇలా

  అసలు ఇంత స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం కరోనా వైరస్ సంక్షోభమే. ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు సంక్షోభంలో ఉన్నప్పుడు తమ పెట్టుబడిని బంగారంవైపు మళ్లిస్తుంటారు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బంగారం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు ఇన్వెస్టర్లు. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగింది. వెండి రేటు కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఓ దశలో బంగారం ధర రూ.58,000 చేరుకుంటే కిలో వెండి రేటు ఏకంగా రూ.77,949 రికార్డు ధరను తాకింది. కరోనా వైరస్‌పై పాజిటీవ్ న్యూస్ వస్తుండటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గుచూపారు. దీంతో బంగారం వెండి ధరలు అంతే స్థాయిలో పతనమవుతున్నాయి.

  హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులో రూ.3350 తగ్గగా గత మూడు రోజుల్లో రూ.4,020 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.54,680. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులో రూ.3010 తగ్గగా మూడు రోజుల్లో రూ.3680 ధర తగ్గింది. ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,140. హైదరాబాద్‌లో వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలోపై ఒక్కరోజులో రూ.7500 పడిపోయింది. అదే గత రెండు రోజుల్లో చూస్తే కిలో వెండి ధర రూ.10,000 పైనే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,010.

  Kisan Credit Card: రైతులకు అలర్ట్... ఆగస్ట్ 31 లోపు రుణాలు చెల్లించకపోతే నష్టమే

  Aadhaar card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ సరిగ్గా ఉందా? అప్‌డేట్ చేయండిలా

  ఇక ఎంసీఎక్స్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై ఏకంగా 0.72 శాతం అంటే రూ.377 పతనమై రూ.51,877 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోపై ఒకేసారి 0.37 శాతం అంటే రూ.250 తగ్గి రూ.66,503 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,928.50 డాలర్లకు కాగా ఔన్స్ వెండి ధర 25.86 డాలర్లకు చేరుకుంది.
  Published by:Santhosh Kumar S
  First published: