• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE FALLS RS 320 TO RS 45700 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate in Hyderabad | కొంతకాలంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నా ఓవరాల్‌గా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. బుధవారం బంగారం ధర తగ్గింది.

  • Share this:
    బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న గోల్డ్ రేట్ తగ్గింది. వచ్చే నెలలో అక్షయ తృతీయ నాటికి బంగారం ధర రూ.50,000 చేరొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్ ఎఫెక్ట్, భారతీయ మార్కెట్లు దారుణంగా పడిపోవడం లాంటి పరిణామాలతో ఇన్వెస్టర్లు కూడా బంగారాన్ని మించిన సురక్షిత పెట్టుబడి లేదన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి గోల్డ్ రేట్ మరింత పెరిగే సూచనలున్నాయి. అయితే బుధవారం నాడు బంగారం ధర తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించినట్టైంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ రూ.320 తగ్గగా, 22 క్యారట్ బంగారం రూ.280 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.45,700 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.41,840. అటు న్యూ ఢిల్లీలోనూ 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.516 తగ్గి రూ.44,517 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,661 డాలర్లు.

    ఓవైపు గోల్డ్ రేట్ తగ్గితే మరోవైపు వెండి ధరలు పెరగడం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపర్చింది. హైదరాబాద్‌లో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.48,500. కానీ న్యూ ఢిల్లీలో మాత్రం వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.146 పెరిగి రూ.47,234 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.03 డాలర్లు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడింది.

    ఇవి కూడా చదవండి:

    Savings: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్

    అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఫ్రీ... పొందండి ఇలా

    Google Tips: ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు