Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటమే బంగారం ధర తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. రూపాయి బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు.

news18-telugu
Updated: September 19, 2019, 6:19 PM IST
Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Rate: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 19, 2019, 6:19 PM IST
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గోల్డ్ రేట్ కాస్త తగ్గింది. దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.38,454. ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటమే బంగారం ధర తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.39,040 కాగా, 22 క్యారెట్ ధర రూ.35,790. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు చూస్తే ఔన్స్ గోల్డ్ ధర 1,497 డాలర్లు. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండిపై రూ.380 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.47,310. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.48,765. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.72 డాలర్లు. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ చూస్తే ఉదయం 24 పైసలు తక్కువగా ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసలు బలపడింది. రూపాయి బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి మరో కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు.

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:



LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా

Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయొద్దు

SBI SMS Alerts: ఎస్‌బీఐ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి
First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...