news18-telugu
Updated: April 20, 2020, 12:46 PM IST
Gold Price Today: పసిడిప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధర భారీగా తగ్గుతోంది. రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న గోల్డ్ రేట్‌కు బ్రేక్ పడింది. రూ.47,000 నుంచి రూ.45,000 ధరకు దిగొచ్చింది. రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1,800 తగ్గింది. సోమవారం ఎంసీక్స్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.235 తగ్గి రూ.45,500 ధరకు చేరుకుంది. గత సెషన్లో 10 గ్రాముల గోల్డ్‌పై రూ.1,600 తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో రెండు సెషనల్లో రూ.1,835 తగ్గడం విశేషం. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.44,220 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.40,530. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్ పతనమవుతోంది. ఔన్స్ బంగారం ధర 1,675 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మే ఫ్యూచర్స్ వెండి ధర రూ.42,940. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.41,170. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15 డాలర్లు. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధర తగ్గుతోంది. దీంతో పాటు లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో బంగారం కొనుగోలుపై పెద్దగా దృష్టిపెట్టట్లేదు. దీనివల్ల డిమాండ్ తగ్గి బంగారం ధర కూడా తగ్గుతోంది. లాక్డౌన్ కారణంగా భారతదేశంలో స్పాట్ గోల్డ్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గిపోయింది.
మరోవైపు ఏప్రిల్ 26న అక్షయ తృతీయ ఉంది. భారతదేశంలో లాక్డౌన్ మే 3 వరకు, తెలంగాణలో మే 7 వరకు కొనసాగనుంది. దీంతో కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్ జ్యువెలర్స్ లాంటి సంస్థలు ఆన్లైన్ సేల్ నిర్వహిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Gold: అదిరిపోయే ఆఫర్... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... కొనండి ఇలా
LIC Policy: రోజుకు రూ.28 పొదుపు... చేతికి రూ.3.97 లక్షలు... ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే
PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
Published by:
Santhosh Kumar S
First published:
April 20, 2020, 12:46 PM IST