బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. కొన్ని రోజులుగా భగ్గుమంటున్న బంగారం ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధానిలో గురువారం ఒక్క రోజే 10 గ్రాముల బంగారంపై రూ.766 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర ఏకంగా రూ.1,070 తగ్గింది. 22 క్యారట్ బంగారం ధర రూ.970 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.41,790 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.38,300. ఇక న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.40,634. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1546 డాలర్లు. రూపాయి బలపడటం, గ్లోబల్ ట్రెండ్స్ బలహీనంగా ఉండటం, అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధవాతావరణం నుంచి కాస్త వెనక్కి తగ్గడం లాంటి అంశాలు బంగారం ధరలు దిగిరావడానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై ఏకంగా రూ.1,148 తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర రూ.49,080 ఉంటే ప్రస్తుత ధర రూ.47,932. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 తగ్గి రూ.49,500 ధరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.93 డాలర్లు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడింది.
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు ఆన్లైన్లో కొంటే లాభమా? నష్టమా?
Gold: బంగారం 10% డిస్కౌంట్‌కే కొనొచ్చు ఇలా
SBI: ఎస్బీఐ నుంచి మరో శుభవార్త... అదిరిపోయిన కొత్త స్కీమ్Published by:Santhosh Kumar S
First published:January 09, 2020, 18:14 IST