పండుగ సీజన్లో, శుభకార్యాలకు బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ట్రేడింగ్ మొదలు కాగానే గోల్డ్ రేట్ రూ.100 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.38073. హైదరాబాద్లో ధరలు చూస్తే 22 క్యారట్ ధర రూ.36,660 కాగా, 24 క్యారట్ ధర రూ.39,990. న్యూ ఢిల్లీలో వెండి ధర రూ.500 తగ్గింది. రూ.45500 నుంచి రూ.45000 ధరకు చేరుకుంది. హైదరాబాద్లో మాత్రం కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. ప్రస్తుత ధర రూ.48600. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్స్ బంగారం ధర 1,492 డాలర్లు, ఔన్స్ వెండి ధర 17.50 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. వాణిజ్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చైనా ముందుకు రావడంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టు మార్కెట్ వర్గాల అంచనా. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ముగిసే వరకు మార్కెట్లో అస్థిర పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. రాబోయేది దీపావళి సీజన్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునేవారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బంగారం ధరలు దిగొస్తే పండుగ సీజన్లో అంతకుమించిన శుభవార్త లేదని భావిస్తున్నారు సామాన్యులు.
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.