Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర

Gold Rate Today | నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

news18-telugu
Updated: July 31, 2019, 6:21 PM IST
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 31, 2019, 6:21 PM IST
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గడంతో రూ.35,780 ధరకు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,780 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,610. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.36,590 కాగా, 22 క్యారెట్ ధర రూ.33,380. సావరిన్ గోల్డ్ ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,500. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,430.70 డాలర్లు.

బంగారం ధర తగ్గితే వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండిపై రూ.70 పెరగడంతో రూ.42,120 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.44,965. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచడంతో ధర పెరిగింది. ఇక మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.85,000 కాగా, అమ్మకం ధర రూ.86,000. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ వెండి ధర 16.54 డాలర్లు. బుధవారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...