Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీ పతనం... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? గతంతో పోలిస్తే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్ తగ్గుతోంది.

news18-telugu
Updated: October 30, 2020, 9:56 AM IST
Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీ పతనం... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీ పతనం... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. గత రెండు రోజులుగా ధరలు పతనం అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.320 పడిపోవడంతో రూ.47,410 ధరకు చేరుకుంది. ఇక స్వచ్ఛమైన 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములపై రూ.340 తగ్గడంతో రూ.51,720 ధరకు చేరుకుంది. గత రెండు రోజుల్లోనే బంగారం ధర రూ.500 తగ్గడం విశేషం. హైదరాబాద్‌లో అక్టోబర్ 12న 22 క్యారట్ బంగారం రూ.48,870 ధరకు చేరుకోగా 24 క్యారట్ బంగారం రూ.53,310 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. అప్పటితో పోలిస్తే బంగారం రూ.1500 తక్కువ ధరకే దొరుకుతోంది. ఆగస్టులో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు పతనం అవుతోంది. దీపావళి సీజన్‌లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుందని, ధర పెరుగుతుందని అందరూ అంచనా వేశారు. మరో రెండు వారాల్లో దీపావళి పండుగ ఉంది. ఇప్పుడు బంగారం ధర తగ్గుతుండటం కస్టమర్లకు శుభవార్తే.

November 2020 Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే

సగం ధరకే iPhone 12... మీ పాత ఫోన్ ఇచ్చి కొనండి ఇలా

ఇక హైదరాబాద్‌లో వెండి ధర కూడా భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.2,280 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.62,420. అక్టోబర్ 7న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,200 స్థాయికి చేరుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వెండి ధర ఎక్కువగానే ఉంది. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 0.22 శాతం అంటే రూ.110 పెరిగి రూ.50,392 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలోపై 0.53 శాతం అంటే రూ.317 పెరిగి రూ.60,489 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,876.90 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 23.60 డాలర్లు.

Online Shopping Tips: ఆన్‌లైన్‌లో ఏమైనా కొంటున్నారా? ఆర్డర్ చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది... మీ ఎస్‌బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే

ఇండియాలో గత త్రైమాసికంలో బంగారం డిమాండ్ 30 శాతం పడిపోయిందని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. అయితే నాలుగో త్రైమాసికంలో పండుగలు ఉండటంతో డిమాండ్ పెరగొచ్చని అంచనా వేస్తోంది. అయితే గతేడాది నాలుగో త్రైమాసికంలో 194.3 టన్నుల గోల్డ్ అమ్ముడుపోయింది. కానీ ఈసారి కాస్త తక్కువగానే అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇందుకు కారణం ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడమే. సాధారణంగా ఇండియాలో పెళ్లిళ్ల సీజన్, దీపావళి పండుగ సమయంలో బంగారానికి డిమాండ్ ఉంటుంది. గత రెండుమూడు నెలలతో పోలిస్తే దసరా సమయంలో నగల దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య కాస్త పెరిగింది.
Published by: Santhosh Kumar S
First published: October 30, 2020, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading