news18-telugu
Updated: April 17, 2020, 11:04 AM IST
Gold price today: గోల్డ్ రేట్ ఢమాల్... ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధర భారీగా తగ్గింది. సరికొత్త రికార్డులతో రూ.50,000 వైపు పరుగులు తీస్తుందనుకున్న గోల్డ్ రేట్ ఒక్కసారిగా తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1,000 పైగా గోల్డ్ రేట్ తగ్గింది. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటలకు 10 గ్రాములపై రూ.1,109 తగ్గి రూ.46,149 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గి 1,716.56 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర కూడా పడిపోయింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మే ఫ్యూచర్స్ కిలోపై రూ.734 తగ్గి రూ.43,521 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 0.7% తగ్గి 15.51 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.45,980 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.42,110. ఇక కిలో వెండి ధర రూ.41,900. గురువారం బంగారం ధర రూ.47,000 దాటిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఈ మార్క్‌ను తాకింది బంగారం ధర. ట్రెండ్ చూస్తే గోల్డ్ రేట్ ఇంకొన్ని రోజుల్లోనే రూ.50,000 దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పటికే గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణపై మొగ్గుచూపడంతో బంగారం ధర పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
Gold: అదిరిపోయే ఆఫర్... మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... కొనండి ఇలా
Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి
Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
April 17, 2020, 11:01 AM IST