Home /News /business /

GOLD PRICE FALLS IN MCX KNOW LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD SS

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం, వెండి ధరలు
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర భారీగా తగ్గింది. లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ తెలుసుకోండి.

    బంగారం, వెండి ధరలు తగ్గాయి. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.23 శాతం అంటే రూ.107 తగ్గి రూ.45,705 ధరకు చేరుకుంది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 0.50 శాతం అంటే రూ.218 తగ్గి రూ.43,075 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా ఇండియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,708 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15.51 డాలర్లు. హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాములపై కేవలం రూ.10 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం ధర రూ.47,020 కాగా, 22 క్యారట్ బంగారం ధర రూ.44,220. వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.610 తగ్గి రూ.43,000 ధర చేరుకుంది.

    హైదరాబాద్‌లో గత వారం బంగారం ధర రూ.47,000 మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే రూ.50,000 మార్క్‌ను త్వరలో చేరుకోవచ్చు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సోమవారం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రెండో సిరీస్ గోల్డ్ బాండ్స్ సేల్ ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. గోల్డ్ బాండ్స్ రేటు ఎంతో, ఈ బాండ్స్‌ వల్ల లాభాలేంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచే సేల్

    Special Trains: రేపటి నుంచి స్పెషల్ ట్రైన్స్... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే

    SBI: వృద్ధులకు కొత్త స్కీమ్ ప్రకటించిన ఎస్‌బీఐ... ఎంత లాభమంటే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates, Sovereign Gold Bond Scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు