హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం గోల్డ్ రేట్ పెరిగిన సంగతి తెలిసిందే. బుధవారం బంగారం ధర తగ్గింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.260 తగ్గి రూ.44,370 ధరకు చేరుకుంది. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.47,400 ధరకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.50 తగ్గి రూ.42,950 ధరకు చేరుకుంది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర తగ్గింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.23 శాతం తగ్గి రూ.45,520 ధరకు చేరుకుంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర వరుసగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా 0.4% తగ్గి కేజీ రూ.42,870 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,701.44 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 15.70 డాలర్లు.
కరోనా వైరస్ సంక్షోభంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ.47,000 మార్క్‌ను దాటింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,000 పైనే ఉంది. అయితే ఇంతకన్నా తక్కువ ధరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని అమ్ముతోంది. బంగారంపైన ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.