కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దిగొస్తున్నాయి. గోల్డ్ రేట్ రూ.50,000 వైపు పరుగులు తీస్తుందని కొనుగోలుదారులు భయపడుతున్న సమయంలో... రెండు రోజుల్లో ధర రూ.1000 తగ్గడం ఊరటనిస్తోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ హైకి చేరుకోవడం పసిడిప్రియులను ఆందోళనకు గురి చేసింది. కానీ రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. మంగళవారం, బుధవారం గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.360 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.44,340 కాగా, 22 క్యారట్ ధర రూ.40,610.
దేశరాజధాని న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.62 తగ్గింది. ప్రస్తుత ధర రూ.43,502. మంగళవారం న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.954 తగ్గిన సంగతి తెలిసిందే. న్యూ ఢిల్లీలో రెండు రోజుల్లో బంగారం ధర రూ.1,000 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,648 డాలర్లు. రూపాయి బలపడటం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.200 తగ్గి రూ.49,800 ధరకు చేరుకుంది. న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.828 తగ్గడం విశేషం. ప్రస్తుతం కిలో వెండి రూ.48,146. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 18.10 డాలర్లు.
ఇవి కూడా చదవండి:
Gold Discount: బంగారంపై రూ.6,000 డిస్కౌంట్... కొనండి ఇలా
EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్... ఆ ఛార్జీలు పెరిగాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold ornmanets, Gold price down, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Silver rates