బంగారం ధర నాలుగు రోజుల తర్వాత తగ్గింది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సాయంత్రం 4.30 గంటలకు జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.29 శాతం అంటే రూ.135 తగ్గి రూ.46,392 ధరకు చేరుకుంది. అంతకుముందు వరుసగా నాలుగు రోజులు బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే. సోమవారం మాత్రం గోల్డ్ రేట్ తగ్గడం విశేషం. ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలపడటం వల్ల గోల్డ్ రేట్ తగ్గిందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,718 డాలర్లు. ఎంసీఎక్స్‌లో వెండి రేటు స్వల్పంగా తగ్గింది. కేజీ ధర రూ.42,045. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లు.
ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే ఇక్కడ గోల్డ్ రేట్ స్వల్పంగా పెరగడం విశేషం. 10 గ్రాములపై రూ.120 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారట్ బంగారం ధర రూ.42,620 కాగా, 24 క్యారట్ బంగారం ధర 45,930. కిలో వెండి ధర రూ.42,600. గత ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారం ధర ఏకంగా 40 శాతం పెరగడం విశేషం. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావించడం, ఇటీవల ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం లాంటి కారణాలతో బంగారం ధర భారీగా పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.