Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర

Gold Price Today | నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.

news18-telugu
Updated: July 26, 2019, 5:13 PM IST
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 26, 2019, 5:13 PM IST
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం న్యూఢిల్లీలో రూ.140 తగ్గడంతో 10 గ్రాముల బంగారం రూ.35,730 ధరకు చేరుకుంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.35,730 కాగా, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,560. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.36,510 కాగా, 22 క్యారెట్ ధర రూ.33,320. ఇక సావరిన్ గోల్డ్ ధర స్థిరంగా ఉంది. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,500. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,418.80 డాలర్లు. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ చెబుతోంది.

మరోవైపు వెండి ధర కేజీపై రూ.150 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.42,150 కాగా హైదరాబాద్‌లో రూ.44,835. మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.85,000 కాగా, అమ్మకం ధర రూ.86,000. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు తగ్గించడంతో వెండి ధర స్వల్పంగా పడిపోయింది. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 16.51 డాలర్లు.

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోవడానికి స్టెప్స్ ఇవే...

Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్... ప్రారంభమైన రిజిస్ట్రేషన్
Loading...
IRCTC: హైదరాబాద్ టు గోవా... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...