Gold, Silver Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం, వెండి ధర

Gold, Silver Price | ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,720. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550.

news18-telugu
Updated: April 24, 2019, 5:22 PM IST
Gold, Silver Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం, వెండి ధర
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగారం కొనాలనుకుంటున్నారా? వెండి వస్తువులు తీసుకోవాలనుకుంటున్నారా? బంగారం, వెండి ధరలు బుధవారం తగ్గాయి. న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,720. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550. సావరిన్ గోల్డ్ 8 గ్రాముల ధర రూ.26,400. స్థానిక నగల వ్యాపారులు, రీటైలర్లు కొనుగోలు తగ్గించడంతో బంగారం ధర తగ్గిందని అంచనా.

అంతర్జాతీయంగా చూస్తే ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,274.20 డాలర్లు. ఔన్స్ వెండి ధర 14.93 డాలర్లు. భారతదేశంలో వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గడం విశేషం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,225. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు తగ్గడంతో వెండి ధర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.80,000, అమ్మకం ధర రూ.81,000.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...

Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవేNew Currency: కొత్త రూ.200, రూ.500 నోట్లు విడుదల చేయనున్న ఆర్‌బీఐ

 
First published: April 24, 2019, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading