news18-telugu
Updated: April 18, 2019, 6:14 PM IST
Gold Price: ఒక్క రోజే రూ.405 తగ్గిన బంగారం ధర
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది. గురువారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.405 తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,385 కాగా 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,225. సావరిన్ గోల్డ్ రూ.100 తగ్గింది. 8 గ్రాముల ధర రూ.26,300. డిమాండ్ కారణంగా ఇటీవల బంగారం ధర భారీగా పెరిగింది. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది.
దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడమే ధర పడిపోవడానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నా బంగారం ధర తగ్గడం విశేషం. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,276.10 యూఎస్ డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15.10 యూఎస్ డాలర్లు. అంతర్జాతీయంగా బంగారం ధర నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరింది. బంగారం మాత్రమే కాదు... వెండి కూడా కేజీపై రూ.104 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,246. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర కూడా తగ్గింది.
Photos: స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వేషాల్లో ఎన్నికల సిబ్బంది
ఇవి కూడా చదవండి:
Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
WhatsApp: వాట్సప్‌లో యానిమేటెడ్ స్టిక్కర్స్... త్వరలోIPL 2019: జొమాటో ప్రీమియర్ లీగ్... 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్
Published by:
Santhosh Kumar S
First published:
April 18, 2019, 6:14 PM IST