బంగారం అంటే భారతీయులకు అత్యంత ప్రీతి. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆపరు. బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే, గత నెల రోజులుగా రిటైల్ బంగారానికి డిమాండ్ తగ్గిన నేపథ్యంలో బంగారం డీలర్లు వరుసగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. బంగారంపై డిస్కౌంట్ ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది పసిడి ప్రియులకు గుడ్న్యూస్ అనే చెప్పాలి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, బంగారం డీలర్లు గత వారం 5 డాలర్లు డిస్కౌంట్ ఇచ్చారు. గత నెలతో పోలిస్తే, ఇప్పుడు ఔన్సు బంగారంపై 6 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. తద్వారా బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి.
ఎంసిఎక్స్లో బంగారం రేట్లు శుక్రవారం గ్రాముకు రూ. 47,526 వద్ద ఉండగా, వెండి కిలోకు రూ. 67,050 వద్ద నమోదైంది. భారతదేశంలో బంగారంపై10.75% దిగుమతి సుంకం, 3% జీఎస్టీ వర్తింపజేస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా ప్రభావం తగ్గి లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించారు. దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని ఒక వ్యాపారి తెలిపారు. జులై 15న ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ. 48,500కు పెరిగిందని, గత నెలలో యూఎస్ డాలర్ విలువ హెచ్చుతగ్గుల మధ్య బంగారం ధర పుంజుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టడంతో బంగారు రేట్లు ఔన్సుకు 1,800 డాలర్ల వద్ద ముగిశాయి.
ఇటీవల సమావేశమైన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కమిటి.. వడ్డీ రేట్లను కొంతకాలం తగ్గించకూడదని, రికార్డు స్థాయిలో ఉంచాలని నిర్ణయించింది. ఈ కారణంగా బంగారం డిమాండ్ స్వల్పంగా తగ్గింది. తద్వారా బంగారు డీలర్లు వరుసగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
డిస్కౌంట్లు ప్రకటిస్తున్న డీలర్లు..
దేశంలో కరోనా వైరస్ ప్రమాదాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా, బంగారంలోకి ఈటిఎఫ్ ప్రవాహాలు కూడా బలహీనంగా ఉన్నాయి. బంగారం బలమైన వృద్ధి కోసం ఈటిఎఫ్ పెట్టుబడిదారులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫలితంగా న్యూయార్క్ ఎస్పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్, లార్జెస్ట్ గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లో హోల్డింగ్స్ గత రెండు నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ డాలర్, బాండ్ దిగుబడి, ఈక్విటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తాయి. వీటి కారణంగా బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery