హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rates: మంచిరోజులు వచ్చాయ్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

Gold Rates: మంచిరోజులు వచ్చాయ్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

Gold and Silver Price Today: (ప్రతీకాత్మక చిత్రం)

Gold and Silver Price Today: (ప్రతీకాత్మక చిత్రం)

Today Gold and Silver Prises: వరుసగా 5వ రోజు బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.50,750 నుంచి రూ.1,900 తగ్గి, 48,850వద్దకు చేరింది. వెండి ధర కొంచెం పెరిగింది.

Gold Prices: వరుసగా 5వ రోజు బంగారం ధర (Gold Rates) తగ్గింది. కాస్త దిగొస్తోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,750 నుంచి రూ.1,900 తగ్గి, 48,850వద్దకు చేరింది. 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 10 గ్రాముల బంగారం రూ.47,850కు దిగింది. గురువారం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.49,750గా నమోదయ్యింది. మొత్తానికి బంగారం ధర పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టు భావిస్తున్నారు. ఆగస్టులో బంగారం ధర ఆల్ టైం హై టచ్ అయింది. 10 గ్రాముల బంగారం రూ. 56,200 వద్ద క్రయ విక్రయాలు జరుపుకున్న బంగారం ధరలు దాదాపు రూ.7,000 వరకూ తగ్గాయి. Multi Commodity Exchange (MCX) లో గోల్డ్ ఫ్యూచర్ 0.16 శాతం ఎక్కువగా నమోదై, రూ.48,592 టచ్ అయింది. గురువారం ధరలు ఔన్సుకు 1,815 డాలర్లుగా నమోదైంది.

Raghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్రరావు, నలుగురు హీరోయిన్లు..


AP Cabinet: నివర్ తుఫాన్ బాధితులకు డబ్బులు.. వారందరికీ ఇవ్వాలన్న సీఎం

రూ.50 పెరిగిన వెండి

వెండి ధరలు మాత్రం మరోసారి కొంచెం పెరిగాయి. కిలో వెండి రూ.60,000 ఉండగా వీటి ధర కిలోకు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం వెండి క్రయ విక్రయాలు రూ.60,050గా మార్కెట్లో ఉంది. నిన్న మార్కెట్లో కిలో వెండి ధర రూ.60,260గా నమోదైంది. ఎంసీఎక్స్ లో కూడా 0.11శాతం వీటి ధర పెరిగింది. సాధారణంగా మార్కెట్లో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్న సమయంలో బంగారంపై పెట్టుబడులకే అత్యధికులు మొగ్గుచూపుతారు. కోవిడ్ (COVID-19) ఇచ్చిన షాక్ నుంచి క్రమంగా కోల్కుంటున్న మార్కెట్లు, టీకా అనే పాజిటివ్ వార్తతో మార్కెట్లో ట్రెండ్ మారుతోంది.

Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు

గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ 

ఒత్తిడిలో బులియన్

బులియన్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుండటంతో వాటి ప్రభావం, బంగారు, వెండిపై పడుతోంది. 6 నెలలపాటు జోరందుకున్న వీటి ధరలు గత నెల రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇలా ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్టు మార్కెట్లో అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయిర్, క్రిస్ మస్ వేడుకలకు మరిన్ని కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు బంగారం కంటే Gold ETF ల్లో పెట్టుబడులు గత కొంతకాలం భారీగా పెరుగుతున్నాయి. నిజానికి బంగారు ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగేందుకు ప్రధాన కారణం ఈటీఎఫ్ ల సేల్స్ పుంజుకోవటమే. పెట్టుబడులు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈటీఎఫ్ లు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 735 టన్నులు దాటిందిని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విశ్లేషిస్తోంది. డాలర్ మారకం విలువ, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం వంటివన్నీ బులియన్ మార్కెట్ పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇన్ని ఒడిదుడుకులు అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో నమోదవుతున్నా మనదేశంలో మాత్రం రీటైల్ బంగారం కొనుగోళ్లలో ఏమాత్రం క్షీణత లేకపోవడం విశేషం.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Gold price down, Gold prices, Silver rates

ఉత్తమ కథలు