Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.35,870 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.32,880.

news18-telugu
Updated: July 9, 2019, 6:37 PM IST
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 9, 2019, 6:37 PM IST
గత వారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర మంగళవారం రోజు ఒక్కసారిగా రూ.600 తగ్గింది. బంగారంతో పాటు విలువైన లోహాలపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిందికేంద్ర ప్రభుత్వం. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 10 గ్రాముల బంగారం ధర రూ.40,000 ధరకు చేరుకునేందుకు ఎక్కువకాలం పట్టదని అంచనా వేశారు నిపుణులు. కానీ మంగళవారంనాడు 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీలో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.34,870 ధరకు దిగి వచ్చింది. 99.5% స్వచ్ఛత గల బంగారం ధర రూ.34,700. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,300. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.35,870 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.32,880.

Read this: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గ్లోబల్ ట్రెండ్స్ వీక్‌గా ఉండటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం ధర 1,394.39 డాలర్లు. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.48 తగ్గి రూ.38,900 ధరకు చేరుకుంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా అమ్మకం ధర రూ.82,000. న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 15.08 డాలర్లు.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
Loading...
WhatsApp: వాట్సప్‌లో వచ్చేస్తున్న కొత్త ఫీచర్స్ ఇవే...

Mobile App: మీరు కొనే వస్తువులు ఒరిజినలా? నకిలీవా? ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు
First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...