Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today | హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.35,980 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.32,980.

news18-telugu
Updated: July 12, 2019, 5:34 PM IST
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 12, 2019, 5:34 PM IST
బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. గోల్డ్ రేట్స్ ఒకరోజు పెరిగితే... మరోరోజు తగ్గుతున్నాయి. గురువారం ఒక్కరోజే రూ.930 పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.40,000 వైపు పరుగులు తీస్తుందని అంతా అనుకుంటే శుక్రవారం గోల్డ్ రేట్ ఒకేసారి రూ.400 తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం దేశరాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.35,400 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,230. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,400. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.35,980 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.32,980. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,409.40 డాలర్లు. మరోవైపు వెండి ధర కేజీపై రూ.125 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,075. మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.21 డాలర్లు.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో



ఇవి కూడా చదవండి:



బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

IRCTC: అమర్‌నాథ్ యాత్రకు తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ... ప్యాకేజీ వివరాలివే

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌... యూత్‌కు రూ.499 మాత్రమే
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...