Gold Rate: గుడ్ న్యూస్... బంగారం ధర తగ్గింది

Gold Price Today | గ్లోబల్ ట్రెండ్ వీక్‌‌గా ఉండటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

news18-telugu
Updated: May 30, 2019, 5:35 PM IST
Gold Rate: గుడ్ న్యూస్... బంగారం ధర తగ్గింది
Gold Rate: గుడ్ న్యూస్... బంగారం ధర తగ్గింది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశరాజధానిలో 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,870 కాగా 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,700. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధర రూ.80 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.33,030 కాగా 22 క్యారెట్ బంగారం ధర రూ.30,280. గ్లోబల్ ట్రెండ్ వీక్‌‌గా ఉండటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,277.10 డాలర్లు.

Read this: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

న్యూ ఢిల్లీలో వెండి ధర కేజీపై రూ.75 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.37,400. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి రేటు కూడా స్వల్పంగా తగ్గింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000 కాగా అమ్మకం ధర రూ.80,000. హైదరాబాద్‌లో కేజీ వెండి ధరపై రూ.10 తగ్గింది. ప్రస్తుత ధర రూ.39,440. న్యూయార్క్‌లో ఔన్సు వెండి ధర 14.48 డాలర్లు.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో




ఇవి కూడా చదవండి:

IRCTC: గోవాలో బస్ ట్రిప్... జస్ట్ రూ.400 మాత్రమేSBI Warning: మోసపోతారు జాగ్రత్త... ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరికలు

Durex Study: శృంగారం సమయంలో భావప్రాప్తికి 70% భారతీయ మహిళలు దూరం
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>