Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate Today | హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.36,040 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,030.

news18-telugu
Updated: July 15, 2019, 4:54 PM IST
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే
Gold Price: గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. బంగారం ధర కాస్త తగ్గింది. సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. శనివారం నాటు 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగింది. సోమవారం స్వల్పంగా ధర తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.100 తగ్గి రూ.35,470 ధరకు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,300. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.36,040 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,030. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.27,400. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,416.80 డాలర్లు. ప్రాఫిట్ బుకింగ్, విదేశీ ట్రెండ్స్ ప్రతికూలంగా ఉండటమే బంగారం తగ్గడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. ఇక వెండి ధర చూస్తే కేజీపై రూ.25 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,175. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటమే వెండి ధర తగ్గడానికి కారణం. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో ఔన్స్ వెండి ధర 15.41 డాలర్లు.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:



PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్లపై 25% వరకు డిస్కౌంట్... పొందండి ఇలా

Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...