• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE CROSSES RS 45000 MARK IN HYDERABAD KNOW 24 KARAT AND 22 KARAT GOLD LATEST RATES SS

Gold Price Today: బంగారం ధర కొత్త రికార్డ్... ఒక్క రోజులో ఎంత పెరిగిందంటే

Gold Price Today: బంగారం ధర కొత్త రికార్డ్... ఒక్క రోజులో ఎంత పెరిగిందంటే

Gold Price Today: బంగారం ధర కొత్త రికార్డ్... ఒక్క రోజులో ఎంత పెరిగిందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | బంగారం ధర పరుగు ఆగట్లేదు. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ రూ.45,000 మార్క్‌ను దాటింది. వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది.

  • Share this:
    బంగారం ధర మళ్లీ భగ్గుమంది. హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే రూ.1,500 పైనే పెరిగింది. 24 క్యారట్ గోల్డ్ ధర రూ.45,000 మార్క్ దాటింది. మంగళవారంతో పోలిస్తే 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో ఏకంగా రూ.1,520 పెరిగింది. ప్రస్తుత ధర రూ.45,310. ఇక 22 క్యారట్ గోల్డ్ ధర రూ.1,390 పెరిగి రూ.41,530 ధరకు చేరుకుంది. మార్చి 1 నుంచి బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఢిల్లీలోనూ గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే రూ.1,155 ధర పెరిగి రూ.44,383 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,638 డాలర్లు. ఇక బంగారం లాగానే వెండి ధర కూడా పరుగు తీస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.50,000 మార్క్ దాటింది. బుధవారం కేజీ వెండిపై రూ.1,330 పెరగడంతో రేటు రూ.50,030 ధరకు చేరుకుంది. ఢిల్లీలో కూడా కేజీ వెండిపై రూ.1,198 పెరిగి రూ.47,729 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వండి ధర 17.17 డాలర్లు.

    డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు బలహీనపడింది. రూపాయి బలహీనపడటం, ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో పాటు కరోనావైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని భావిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి:

    Home loan: సొంత ఇల్లు మీ కలా? హోమ్ లోన్ ఎంత తీసుకోవాలో తెలుసుకోండి

    Realme 6: రేపే రియల్‌మీ 6 లాంఛింగ్... వారికి రియల్‌మీ బ్యాండ్ ఉచితం

    SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published: