HOME »NEWS »BUSINESS »gold price breaches rs 40000 per 10 grams likely to gain further mk

Gold Rate: తులం బంగారం రూ.75000 వైపు పరుగులు...పసిడి ప్రేమికులకు షాక్...

Gold Rate: తులం బంగారం రూ.75000 వైపు పరుగులు...పసిడి ప్రేమికులకు షాక్...
Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం బంగారం ధరలపై పడింది. దీంతో దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ముందు ముందు తులం ధర రూ.75 వేల వైపు పరుగులు పెడుతుందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Share this:
    బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం బంగారం ధరలపై పడింది. దీంతో దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ముందు ముందు తులం ధర రూ.75 వేల వైపు పరుగులు పెడుతుందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,390గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.37,940గా ఉంది. 2 రోజుల్లోనే 10గ్రాములపై రూ.600 పెరగడం విశేషం. ఇక అటు అంతర్జాతీయ మార్కెట్లో అయితే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1550 డాలర్లు తాకింది. మరోవైపు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం అంతకంతకూ భారమవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా పసిడి ధరలకు కారణమైంది. అటు వెండి ధరలు సైతం మండిపోతున్నాయి.

    ఇరాన్‌పై అమెరికా దాడి నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందన్న భయాలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి, ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అయితే క్రమంగా పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.

    Published by:Krishna Adithya
    First published:January 04, 2020, 18:00 IST