సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, షేర్ మార్కెట్.. ఇలా పెట్టుబడి మార్గాలు ఎన్ని ఉన్నా సంప్రదాయబద్ధమైన పెట్టుబడులపై చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి బంగారం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం.. గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టుబడులు ఫర్వాలేదనిపిస్తున్నా.. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు మాత్రం చాలామందికి నష్టాలను అందించాయి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటే బంగారం మీద పెట్టుబడి పెట్టినా పెద్దగా లాభాలు రావని ఇన్వెస్టర్లు సలహా ఇస్తున్నారు. అయితే మీ దగ్గర ఉన్న బంగారం, స్థిరాస్థులు అమ్మాలనుకుంటే దేనికి ఎంత ట్యాక్స్ పడుతుందన్న విషయం మాత్రం గమనించాల్సి ఉంటుంది. మరి, బంగారం, స్థిరాస్థులలో స్వల్ప కాలం లేదా దీర్ఘ కాలానికి పెట్టుబడులు పెట్టినప్పుడు ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
బంగారంలో దీర్ఘ కాలిక పెట్టుబడులు అంటే మూడు సంవత్సరాలకు మించి పెట్టుబడులు పెట్టడం అన్నమాట. అంతకంటే తక్కువ సమయానికి పెట్టుబడి పెట్టి బంగారాన్ని తిరిగి అమ్మినప్పుడు వచ్చిన మొత్తానికి మీ ట్యాక్స్ శ్లాబ్ రేట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మీకు వచ్చిన లాభాలపై 20.8 శాతం ( ద్రవ్యోల్బణ సూచికను పరిగణనలోకి తీసుకొని లెక్కగట్టిన శాతం) పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
SBI ADWM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో ఈ మెషీన్ చూశారా? ఇలా వాడుకోండి
Personal Finance: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు
గోల్డ్ బాండ్స్ విషయంలో లిస్టెడ్ బాండ్స్ అయితే సంవత్సరం కంటే ఎక్కువ, అన్ లిస్టెడ్ బాండ్స్ అయితే మూడు సంవత్సరాలు లాంగ్ టర్మ్ కింద లెక్కగట్టవచ్చు. దీనివల్ల కూడా షార్ట్ టర్మ్ అయితే వచ్చే లాభం పై మీ పన్ను రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ అయితే 20.8 శాతం ( ద్రవ్యోల్బణ సూచికను పరిగణనలోకి తీసుకొని లెక్కగట్టిన శాతం) పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
mAadhaar App: ఆధార్ కార్డు ఉందా? 35 సేవలకు ఎంఆధార్ యాప్ చాలు... ముఖ్యమైనవి ఇవే
EPF Account: అలర్ట్... ఈపీఎఫ్ అకౌంట్లో ఈ వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు రావు
స్థిరాస్థి పై పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే రెండేళ్ల కంటే తక్కువ సమయాన్ని ఇందులో షార్ట్ టర్మ్ గా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఓ ప్లాట్ కొన్న సంవత్సరానికి దాన్ని అమ్మితే మీకు వచ్చిన లాభంపై మీ ట్యాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే రెండేళ్లు దాటితే ద్రవ్యోల్బణ సూచీని పరిగణనలోకి తీసుకుంటే 20.8 శాతం పన్ను చెల్లించాల్సి రావచ్చు.
అందుకే పీపీఎఫ్, ఎన్ పీస్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ వంటి వాటిలోనూ కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను భారం తగ్గించుకోవడంతో పాటు ఎక్కువ మొత్తాన్ని ఆర్జించే వీలుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Income tax, Personal Finance, Real estate, Real estate in Hyderabad, Silver rates, TAX SAVING