Gold Rate: అందనంత ఎత్తుకు పసిడి...టార్గెట్ రూ.52,000 దిశగా తులం బంగారం...

ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల చోటు చేసుకునేందుకు రూపాయి పతనం కారణం కాగా, అంతర్జాతీయంగా మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లించడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 5:32 PM IST
Gold Rate: అందనంత ఎత్తుకు పసిడి...టార్గెట్ రూ.52,000 దిశగా తులం బంగారం...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 23, 2019, 5:32 PM IST
అతి త్వరలోనే తులం బంగారం ధర రూ.52 వేలు తాకడం ఖాయమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మేలిమి బంగారం (24 కేరట్లు) 10 గ్రాముల ధర రూ.40 వేల సమీపంలో ట్రేడవుతోంది. ఇదే జోరు కొనసాగిస్తే బంగారం తులం ధర అర లక్ష దాటడం ఖాయమని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల చోటు చేసుకునేందుకు రూపాయి పతనం కారణం కాగా, అంతర్జాతీయంగా మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లించడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బంగారం ధర అంతర్జాతీయ చూసిట్లయితే ఔన్సు బంగారం ధర 1498 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే హైదరాబాద్ లో బంగారం (24 కేరట్లు) 10 గ్రాములు ధర రూ.38942కు తాకగా, ముంబైలో బంగారం ధర రూ.38930కు తాకింది. మరోవైపు బంగారం రానున్న ఫెస్టివల్ సీజన్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...