Gold Rate: తులం బంగారం రూ. లక్ష వైపు పరుగులు...ఎందుకో తెలిస్తే షాక్ తింటారు...

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

దేశీయంగా 24 కేరట్ల ధర 45 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.

 • Share this:
  Todays Gold Rate in Hyderabad : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. (gold rate in hyderabad today) ఇప్పటికే రూ.45 వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర (gold price) ముందు ముందు తులం ధర రూ.1 లక్ష వైపు పరుగులు పెడుతుందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నెలరోజులుగా పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగిస్తున్నాయి. కరోనా వైరస్‌ విజృంభించడంతో ప్రపంచ ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్‌ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,700 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. గురువారం 10 గ్రాములు బంగారం (gold price) ఒక దశలో రూ.46,000 పలికింది. కరోనా వైరస్ అమెరికా, యూరప్ దేశాలకు పాకడంతో అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి, ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అయితే క్రమంగా పెరుగుతున్న పసిడి ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. అమెరికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ కూడా సోమవారం భారీగా పతనమై ట్రేడింగ్ తాత్కాలికంగా నిలిపివేసింది.

  గతంలో సార్స్ వైరస్ కన్నా ప్రస్తుత కరోనా వైరస్ మరింత భీతావహ స్థితి కల్పించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేసే శక్తిగా ఉంది. ఫలితంగా దీని ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చైనా జీడీపీ సైతం 2020లో 5.6శాతానికి పరిమితం కానుంది. అయితే చైనా ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

  ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1700 డాలర్లు తాకింది. గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1700 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా దాదాపు 300 డాలర్లు పెరిగింది. ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 45 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఊపందుకుంటే మాత్రం అత్యంత వేగంగా బంగారం ధర తులం రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనాలు వెలువడుతున్నాయి.
  Published by:Krishna Adithya
  First published: