• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • GOLD LOANS STARTING AT 7PC BANKS OFFERING THE LOWEST INTEREST RATES MK

కరోనా చికిత్స కోసం సడెన్‌‌గా డబ్బు అవసరం వచ్చిందా...నిమిషాల్లో డబ్బు కావాలంటే..ఇలా చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

వివిధ బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు బంగారం వాల్యూలో 90 శాతాన్ని రుణంగా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా, గత కొద్ది నెలలుగా గోల్డ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

  • Share this:
    అత్యవసర నిధుల సేకరణలో భాగంగా ఎక్కవ మంది గోల్డ్ లోన్లను ఆశ్రయిస్తుంటారు. బంగారంపై రుణాలు ఇవ్వడం మూలాన పెద్దగా ఇబ్బందులు ఉండని కారణంగా, బ్యాంకులు కూడా వీటిని ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటాయి. గత ఏడాది కోవిడ్–-19 విజృంభనతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రుణ అర్హత మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు అమల్లో ఉన్న రుణ అర్హత మొత్తాన్ని 75% నుండి 90% కు పెంచింది. అనగా, వివిధ బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు బంగారం వాల్యూలో 90 శాతాన్ని రుణంగా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా, గత కొద్ది నెలలుగా గోల్డ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, గోల్డ్ లోన్లు తీసుకునే సందర్భంలో బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు అమలు చేస్తున్న వడ్డీరేట్లను పరిశీలించాలి నిర్ణయం తీసుకోవాలని గుర్తించుకోండి. వడ్డీరేట్లతో పాటు వాటి నియమ నిబంధనలను కూడా స్పష్టంగా తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచింది. వివిధ బ్యాంకులు అమలు చేస్తున్న వడ్డీ రేట్లలో కొంత వ్యత్యాసం ఉంటుంది.

    బ్యాంకును బట్టి, వ్యక్తి క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే, తక్కువ వడ్డీకే రుణం పొందటం సాధ్యపడదు. కాబట్టి, గోల్డ్ లోన్ కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఆ బ్యాంకు అమలు చేస్తున్న వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పెయిమెంట్ ఛార్జీలు, లోన్ డ్యురేషన్, లేట్ పేయిమెంట్ ఛార్జీలు వంటి విషయాల గురించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని గుర్తించుకోండి.

    వీటితో పాటు, మీరు తీసుకున్న లోన్ను సకాలంలో తిరిగి చెల్లించటానికి మీ వద్ద సరైన ప్రణాళిక ఉందని నిర్ధారించుకోవాలి. రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉంటే ఎక్కువ రుణం తీసుకోకండి. మీరు తీసుకునే మొత్తం రుణం, మీ ఆదాయంలో 40% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలని బ్యాంక్‌బజార్‌ పేర్కొంటుంది. బ్యాంక్ బజార్ డేటా ప్రకారం, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు కేవలం 7 శాతం వడ్డీరేటుకే గోల్డ్ లోన్ అందజేస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో అతి తక్కువ వడ్డీకే బంగారు రుణాలు అందజేస్తున్న ఈ టాప్ 15 బ్యాంకుల జాబితాను పరిశీలించండి.

    తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ అందిస్తున్న టాప్ 15 బ్యాంకులు ఇవే..

    బ్యాంకు వడ్డీ రేటు (శాతాల్లో)

    పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7.00

    బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50

    కెనరా బ్యాంక్ 7.65

    కర్ణాటక బ్యాంక్ 8.38

    ఇండియన్ బ్యాంక్ 8.50

    యూకో బ్యాంక్ 8.50

    ఫెడరల్ బ్యాంక్ 8.50

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.75

    యూనియన్ బ్యాంక్ 8.85

    జె & కె బ్యాంక్ 8.90

    సెంట్రల్ బ్యాంక్ 9.05

    ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 9.25

    హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.50

    బ్యాంక్ ఆఫ్ బరోడా 9.60
    Published by:Krishna Adithya
    First published: