Gold loans rising: కరోనా కారణంగా గణనీయంగా పెరిగిన గోల్డ్ లోన్స్.. ఏడాది కాలంలో ఎంత పెరిగాయంటే?

అయితే, బంగారం, ప్రాపర్టీ. సెక్యూరిటీల తనఖాపై రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ మీ తక్షిణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకు రుణాలను పరిగణించవచ్చు. (ఫ్రతీకాత్మక చిత్రం)

గతేడాది మే నుంచి ఈ ఏడాది మే నాటికి తీసుకున్న రుణాలను పరిశీలించగా ఇతర రుణాల కంటే బంగారంపై సామాన్యులు తీసుకున్న రుణాల విలువే ఎక్కువని తేలింది. ఈ కాలంలో బంగారు రుణాల విలువ రూ. 15,686 కోట్ల మేర పెరిగింది.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుడి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. గత 15 నెలలుగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం తగ్గడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీనికి తోడు కరోనా చికిత్సకు లక్షల్లో ఖర్చు చేయాల్సి రావడం సామాన్యులను మరింత కష్టాల పాలు చేసింది. ఈ కఠినమైన పరిస్థితుల్లో పెరుగుతున్న నగదు సంక్షోభం, ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు ప్రజలు బంగారు రుణాల వైపు మొగ్గుచూపారు. చాలా మంది తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం గానీ, పూర్తిగా విక్రయించడం గానీ చేశారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్బీఐ) పేర్కొనడమే దీనికి నిదర్శనం.

గోల్డ్​ లోన్స్​ ఎంత పెరిగాయి?

గతేడాది మే నుంచి ఈ ఏడాది మే నాటికి తీసుకున్న రుణాలను పరిశీలించగా ఇతర రుణాల కంటే బంగారంపై సామాన్యులు తీసుకున్న రుణాల విలువే ఎక్కువని తేలింది. ఈ కాలంలో బంగారు రుణాల విలువ రూ. 15,686 కోట్ల మేర పెరిగింది. 2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ. 46,415 కోట్లు ఉండగా.. అది 2021 మే నెల నాటికి రూ. 62,101 కోట్లకు చేరింది. కరోనా ప్రారంభమైన 2020 మార్చి నెలలోనే బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐలో బంగారంపై గతేడాది (2020–21) సామాన్యులు తీసుకున్న రుణాలు ఏకంగా 465 శాతం పెరిగాయి. తక్కువ ఆదాయ కుటుంబాలు, గ్రామీణ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో బంగారు రుణాలకు అమాంతం డిమాండ్​ పెరిగింది.

గోల్ట్​లోన్స్​ ఎందుకు పెరుగుతున్నాయి?

కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ల కారణంగా చిన్న వ్యాపార సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో చిన్న వ్యాపార సంస్థలు ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు, కార్మికులు తమ కుటుంబ పోషణ కోసం బంగారు రుణాలను ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. సాదారణంగా ఆరోగ్యం, విద్య, వివాహం వంటి ఖర్చులను తీర్చడానికి బంగారు రుణాలను ఆశ్రయిస్తుంటారు. కానీ, కరోనా కారణంగా కనీస అవసరాలు తీర్చుకునేందుకు బంగారు రుణాల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపారని గణాంకాలను బట్టి తెలుస్తోంది.

ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published: