Home /News /business /

GOLD LOANS GET RS 1 LAKH GOLD LOAN FOR JUST 7 PERCENT INTEREST CHECK OUT INDICATIVE EMIS AND OFFERS FROM LEADING LENDERS GH SK

Gold Loan: అతి తక్కువ వడ్డీకే రుణాలు.. రూ.1 లక్ష వరకు గోల్డ్ లోన్ ఇస్తున్న సంస్థలు ఇవే

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

Gold loans at low interest: బంగారు రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారి కోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు 7% ప్రారంభ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

అత్యవసరంగా డబ్బు అవసరమైన స్థితులలో రుణగ్రహీతలకు ముందుగా గుర్తొచ్చేది గోల్డ్ లోన్. బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో హామీగా/తాకట్టు పెట్టి త్వరితగతిన తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందవచ్చు. పర్సనల్ లోన్ కంటే చాలా వేగంగా తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ పై రుణాలు మంజూరవుతాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతల దరఖాస్తులను బ్యాంకులు ఎక్కువగా తిరస్కరిస్తాయి. అటువంటి సమయాల్లో గోల్డ్ లోన్స్ బాగా ఉపయోగపడతాయి.

గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. మీ ఆర్థిక అవసరాలను తీర్చడానికి మీరు తాకట్టు పెట్టే బంగారం సరిపోతుందో లేదో నిర్ధారించుకోవాలి. సాధారణంగా తాకట్టు పెట్టిన బంగారం మార్కెట్ విలువలో.. 75% వరకు మాత్రమే రుణాలు మంజూరవుతాయి. మీ బంగారం మార్కెట్ విలువ రూ.1 లక్ష ఉంటే.. మీరు రూ .75,000 కంటే ఎక్కువగా రుణం పొందలేరు.

అందువల్ల బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలతో పాటు త్వరగా రుణాలు అందిస్తున్నాయో లేదో దరఖాస్తుదారులు ముందస్తుగా చెక్ చేసుకోవాలి. రీపేమెంట్‌లు ఆలస్యమైతే అదనపు జరిమానాలు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈఎంఐల గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే రుణం తీసుకోవాలి.

బంగారు రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారి కోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు 7% ప్రారంభ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

* రెండు సంవత్సరాలకు రూ. 1 లక్షపై వడ్డీ రేట్లు, ఈఎంఐలు ఇస్తున్న బ్యాంకులు

1. పంజాబ్ &సింథ్ బ్యాంక్: వడ్డీ రేటు 7 %.. ఈఎంఐ రూ.4,477

2. కెనరా బ్యాంక్: వడ్డీ రేటు 7.35%.. ఈఎంఐ రూ.4,493

3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు 7.50%.. ఈఎంఐ రూ.4,500

4. యూనియన్ బ్యాంక్: వడ్డీ రేటు 8.20%.. ఈఎంఐ రూ.4,532

5. బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు 8.45%.. ఈఎంఐ రూ.4,543

6. కర్ణాటక బ్యాంక్: వడ్డీ రేటు 8.49%.. ఈఎంఐ రూ.4,545

7.ఇండియన్ బ్యాంక్: వడ్డీ రేటు 8.50%.. ఈఎంఐ రూ.4,546

8. యూకో బ్యాంక్: వడ్డీ రేటు 8.50%.. ఈఎంఐ రూ.4,546

9. ఫెడరల్ బ్యాంక్: వడ్డీ రేటు 8.50%.. ఈఎంఐ రూ.4,546

10. పంజాబ్ నేషనల్ బ్యాంక్: వడ్డీ రేటు 8.75%.. ఈఎంఐ రూ.4,557

11. జే అండ్ కే బ్యాంక్: వడ్డీ రేటు 8.80%.. ఈఎంఐ రూ.4,559

12. సెంట్రల్ బ్యాంక్: వడ్డీ రేటు 8.85%.. ఈఎంఐ రూ.4,562

13. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్: వడ్డీ రేటు 8.85%.. ఈఎంఐ రూ.4,562

14. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: వడ్డీ రేటు 8.95%.. ఈఎంఐ రూ.4,566

15. బ్యాంక్ ఆఫ్ బరోడా: వడ్డీ రేటు 9.00%.. ఈఎంఐ రూ.4,568

* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేట్లు

1. బజాజ్ ఫిన్ సర్వ్: వడ్డీ రేటు 11%.. ఈఎంఐ రూ.4,661

2. ముథూట్ ఫైనాన్స్: వడ్డీ రేటు 11.90%.. ఈఎంఐ రూ.4,703

3. మనప్పురం ఫైనాన్స్: వడ్డీ రేటు 12.00%.. ఈఎంఐ రూ.4,707

ఇవి కూడా చదవండి:

Gold Rates Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం రేట్లు.. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే...

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు డేటా
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Gold, Gold loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు