Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నా మారటోరియం.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

పండుగ పూట మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నిజంగా గుడ్ న్యూస్ (good news) చెప్పింది. బంగారంపై రుణాలు (gold loans) తీసుకున్నవారికి కూడా మారటోరియం (moratorium) వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: November 11, 2020, 7:27 PM IST
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నా మారటోరియం.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
పండుగ పూట మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నిజంగా గుడ్ న్యూస్ (good news) చెప్పింది. బంగారంపై రుణాలు (gold loans) తీసుకున్నవారికి కూడా మారటోరియం (moratorium) వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దీంతో బంగారాన్ని కుదువ పెట్టి రుణాలు తీసుకున్నవారి నెత్తిన పాలు పోసినట్టైంది. 'వడ్డీపై వడ్డీ' (interest on interest) విధానంపై మరింత స్పష్టత ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రశ్నలకు తాజాగా ఇచ్చిన సమాధానాలు కామన్ మ్యాన్ లో (common man) ఆనందం నింపుతోంది.

వడ్డీపై వడ్డీ

ఈ పథకం కింద బంగారు తాకట్టు పెట్టిన రుణ గ్రహీతలకు 'వడ్డీ పై వడ్డీ' వసూలు చేసినట్టైతే ఆ మొత్తాన్ని తిరిగి ఆయా బ్యాంకులు చెల్లించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ పథకం కింద మరో 8 కేటెగెరీలు వస్తాయని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణాలు కూడా దీని పరిధిలోకే వస్తాయి. జాయింట్ లయబిలిటీ గ్రూప్ (JLG) కిందికే గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తులు వస్తారు.

సుప్రీం ఆదేశాల అమలులో భాగం

వాణిజ్య అవసరాల నిమిత్తం వ్యక్తులు తీసుకున్న వాహనాల రుణాలు కూడా మారటోరియం పరిధిలోకే వస్తాయని ఇప్పటికే కేంద్రం స్పష్టంచేసింది. అక్టోబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రుణాలు తీసుకున్న వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పలు ఆర్థిక సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

2 కోట్ల రుణాల వరకు

6 నెలల మారటోరియం కాలంలో రుణాలు, క్రెడిట్ కార్డులపై వినియోగదారుల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ అయిన వడ్డీపై వడ్డీని బ్యాంకులు రుణగ్రహీతలకు తిరిగి ఇస్తున్నాయి. రూ. 2 కోట్ల వరకు రుణంగా తీసుకున్న వ్యక్తులు, చిన్న వ్యాపారులు ఈ మొత్తం పొందడానికి అర్హులు కాగా మారటోరియం ఎంపిక చేసుకోని వారికి కూడా ఈ 6 నెలల కాలంలో చెల్లించిన వడ్డీని బ్యాంకులు తిరిగి ఇస్తున్నాయి.

కోవిడ్ కారణంగానే..

కరోనా కారణంగా మార్చి నెలలో నెలసరి వాయిదాలు, పలు బకాయిలను చెల్లించడంపై తాత్కాలిక నిషేధం ప్రకటించింది. అత్యున్నత ధర్మాసనం తీర్పు ప్రకారం మార్చ్ 1 నుంచి ఆగస్టు 31 వరకు వడ్డీ మాఫీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థుల విద్య కోసం తీసుకున్న రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్స్, ప్రొఫెషనల్ లోన్స్, కంజంప్షన్ లోన్స్, వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలు, కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ వంటివి వాటిపై మారటోరియం వర్తిస్తుంది. అయితే ఫిబ్రవరి 29, 2020 వరకున్న రుణ ఖాతాలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుని వడ్డీ లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఈ పథకం అమలుతో కేంద్ర ఖజానాపై అదనంగా ఆర్థిక భారం (financial burden) పడనుంది. ఇందుకు రూ. 6,500 కోట్లు అదనపు ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది.

బంగారం విలువలో 90శాతం రుణం

బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ (reserve bank) పెంచింది. గతంలో ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేసాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ సవరించిన విధానం ప్రకారం బంగారం విలువలో 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇందుకు మీ బంగారం నాణ్యతను ఆయా బ్యాంకులు పరీక్షిస్తాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: November 11, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading