Gold Loan Vs Personal Loan: గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్... ఈ రెండిట్లో ఏది బెస్ట్

Gold Loan Vs Personal Loan | గోల్డ్ లోన్ తీసుకోవాలా? పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఈ రెండింటి మధ్య తేడాలేంటీ? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ లోన్ అయితే బెటర్? తెలుసుకోండి.

news18-telugu
Updated: August 14, 2020, 10:07 AM IST
Gold Loan Vs Personal Loan: గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్... ఈ రెండిట్లో ఏది బెస్ట్
Gold Loan Vs Personal Loan: గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్... ఈ రెండిట్లో ఏది బెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి మీ ఆర్థిక పరిస్థితుల్ని దిగజారుస్తోందా? ప్రస్తుతం అవసరాలు తీరడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉందా? డబ్బులు కావాలంటే చాలా మార్గాల్లో అప్పులు చేయొచ్చు. అయితే ఎక్కువగా వినిపించేది పర్సనల్ లోన్ మాత్రమే. ఇక ఇంట్లో బంగారం ఉంటే గోల్డ్ లోన్ వైపు మొగ్గుచూపుతుంటారు. మరి మీరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు చేయాలనుకుంటున్నారా? బంగారంపై రుణాలు తీసుకుందామని అనుకుంటున్నారా? లేక పర్సనల్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? అసలు ఈ రెండు రుణ మార్గాల్లో ఏది బెస్ట్? తెలుసుకోండి.

బంగారంపై ఇచ్చే రుణాలను సెక్యూర్డ్ లోన్స్‌గా భావిస్తుంటాయి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు. పర్సనల్ లోన్‌తో పోలిస్తే గోల్డ్ లోన్ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కస్టమర్ దగ్గర నగలు, కాయిన్స్, బార్స్ రూపంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కస్టమర్లు రుణాలు చెల్లించకపోతే గడువు తీరిన తర్వాత వారి నగలను అమ్మి లోన్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తుంటాయి. గతంలో బంగారం విలువలో 70 శాతం వరకు మాత్రమే రుణాలు వచ్చేవి. అంటే మీ దగ్గరున్న బంగారం విలువ రూ.1,00,000 అయితే అందులో రూ.70,000 వరకు మాత్రమే లోన్ వచ్చేది. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈ పరిమితిని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. అంటే రూ.1,00,000 విలువైన బంగారం ఉంటే రూ.90,000 వరకు లోన్ తీసుకోవచ్చు.

Loan: మీరు చిరు వ్యాపారులా? మోదీ ప్రభుత్వం లోన్ ఇస్తున్న లోన్‌కు అప్లై చేయండిలా

SBI: రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలా? ఓటీపీతో చేయండి ఇలా

బంగారంపై రుణాలకు కాల వ్యవధి మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 29 శాతం వరకు ఉంటాయి. గోల్డ్ లోన్ తీసుకోవాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌లు తప్పనిసరి. ప్రాసెసింగ్ ఫీజు, గోల్డ్ వ్యాల్యుయేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు ఉంటాయి. టర్మ్ లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీతో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

ఇక పర్సనల్ లోన్ విషయానికి వస్తే వీటిని అన్ సెక్యూర్డ్ లోన్‌గా భావిస్తాయి బ్యాంకులు. ఇందుకు కారణం పర్సనల్ లోన్లను ఎలాంటి తాకట్టు లేకుండా ఇస్తాయి. అయితే పర్సనల్ లోన్ ఇచ్చేముందు కస్టమర్ల క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ లాంటివన్నీ చెక్ చేస్తాయి బ్యాంకులు. వడ్డీ రేట్లు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్ల క్రెడిట్ స్కోర్‌పైనా వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం 8.5 శాతం నుంచి 25 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్‌క్రమ్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం తప్పనిసరి.PF withdrawal: ఈ మూడు కరెక్ట్‌గా ఉంటేనే పీఎఫ్ విత్‌డ్రా సాధ్యం

Gold Price Today: రూ.4,000 తగ్గిన బంగారం... కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్

మరి ఈ రెండు లోన్లలో ఏది తీసుకుంటే బెటర్. మీ అవసరాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర బంగారం ఉన్నట్టయితే గోల్డ్ లోన్ తీసుకోవడమే మంచిది. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. బంగారం లేకపోతే పర్సనల్ లోన్ ఎంచుకోవాలి. తక్కువ మొత్తంలో లోన్ కావాలనుకుంటే పర్సనల్ లోన్ తీసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే పర్సనల్ లోన్ వచ్చే అవకాశాలు తక్కువ. మీకు సరైన ఆదాయ మార్గాలు ఉంటేనే పర్సనల్ లోన్ మంజూరవుతుంది. తక్కువ వడ్డీ, సులువుగా చెల్లించే అవకాశాలున్న లోన్లు మాత్రమే ఎంచుకోవడం మంచిది.
Published by: Santhosh Kumar S
First published: August 14, 2020, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading