Loans: డబ్బులకు ఇబ్బందిగా ఉందా? అప్పులు ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు

Personal Loan | ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి అనేక రకాల లోన్స్ ఉన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో మీ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఎన్ని రకాల లోన్స్ తీసుకోవచ్చో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 1, 2020, 5:08 PM IST
Loans: డబ్బులకు ఇబ్బందిగా ఉందా? అప్పులు ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు
Loans: డబ్బులకు ఇబ్బందిగా ఉందా? అప్పులు ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల కోత, జీతాల తగ్గింపు, వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం లాంటివన్నీ ఆర్థిక సమస్యలకు దారితీస్తున్నాయి. చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవసరాలు తీరాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. బయట అప్పులు కూడా దొరకడం కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో బ్యాంకులు ఇచ్చే లోన్స్ ఆదుకుంటూ ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ, మంచి క్రెడిట్ రికార్డ్ ఉన్నవారికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ఎప్పుడూ ముందే ఉంటాయి. మరి మీరు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎన్ని రకాలుగా అప్పులు తీసుకోవచ్చో తెలుసుకోండి.

Gold Loan: మీరు సేవింగ్స్ రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేశారా? డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ కొని పెట్టుకున్నారా? అత్యవసర సమయాల్లో మిమ్మల్ని బంగారం ఆదుకుంటుంది. గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా సులువైపోయింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే గోల్డ్ లోన్స్‌కు వడ్డీ రేట్లు చాలా తక్కువ.

Loan on Insurance: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తున్నారా? అయితే ఈ ఆర్థిక సంక్షోభంలో ఎల్ఐసీ పాలసీ మిమ్మల్ని ఆదుకుంటుంది. పాలసీపై మీరు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి.

LIC Policy Loan: మీ ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవచ్చు ఇలా

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Gold Loan, COVID-19 Loan, Loan on cars, Credit Card Loans, Loan on PPF, Loan on Insurance, Loan on Mutual funds, Loan on Fixed deposit, గోల్డ్ లోన్, కోవిడ్ 19 లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, పీపీఎఫ్ లోన్
ప్రతీకాత్మక చిత్రం


COVID-19 Loan: కొన్ని బ్యాంకులు కోవిడ్ 19 పేరుతో కొన్ని రకాల పర్సనల్ లోన్ స్కీమ్స్ ప్రారంభించాయి. తమ బ్యాంకు కస్టమర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్న ఆలోచనతో బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. అత్యవసరంగా డబ్బులు కావాల్సినవాళ్లు ఈ లోన్స్ తీసుకోవచ్చు. మంచి క్రెడిట్ రికార్డ్ ఉన్న కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఇస్తున్నాయి బ్యాంకులు.Loan on PPF: మీరు పీపీఎప్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? అయితే పీపీఎఫ్ అకౌంట్‌లో మీరు ఇన్నాళ్లూ దాచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని రుణంగా తీసుకోవచ్చు. చాలా తక్కువ వడ్డీ ఉంటుంది.

Gold Loan, COVID-19 Loan, Loan on cars, Credit Card Loans, Loan on PPF, Loan on Insurance, Loan on Mutual funds, Loan on Fixed deposit, గోల్డ్ లోన్, కోవిడ్ 19 లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, పీపీఎఫ్ లోన్
ప్రతీకాత్మక చిత్రం


Loan: రూపాయి వడ్డీకే లోన్ తీసుకోవచ్చు... ఆ స్కీమ్‌లో ఉన్నవారికే అవకాశం

SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా

Loan on cars: కారు ఉన్నవాళ్లు తమ వాహనంపై రుణాలు తీసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు వాహనాలపై రుణాలు ఇచ్చేందుకు కొత్త స్కీమ్స్ ప్రకటించాయి. తక్కువ ఈఎంఐ, ఎక్కువ కాల వ్యవధితో రుణాలు తీసుకోవచ్చు.

Credit Card Loans: క్రెడిట్ కార్డుపైన ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. ఈ లోన్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ. కొన్ని గంటల వ్యవధిలో డబ్బులు అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. కానీ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి.

Credit Card Loan: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...

Gold Loan, COVID-19 Loan, Loan on cars, Credit Card Loans, Loan on PPF, Loan on Insurance, Loan on Mutual funds, Loan on Fixed deposit, గోల్డ్ లోన్, కోవిడ్ 19 లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, పీపీఎఫ్ లోన్
ప్రతీకాత్మక చిత్రం


Loan on Mutual funds: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇస్తాయన్న ఆలోచనతో ఇప్పుడు రీడీమ్ చేసుకోవాలనుకోవట్లేదా? మీరు మీ మ్యూచువల్ ఫండ్స్‌పైన కూడా లోన్ తీసుకోవచ్చు.

Loan on Fixed deposit: మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? అయితే బ్యాంకులు మీకు ఈజీగానే సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాయి. మీ ఎఫ్‌డీని మధ్యలోనే విత్‌డ్రా చేయకుండా దానిపై లోన్ తీసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 1, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading