Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

Gold (ప్రతీకాత్మక చిత్రం)

Gold Loan | గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంగారంపై రుణాలు తీసుకోవడం సులువే. అయితే లోన్ తీసుకునేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

  • Share this:
    అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరాలు తీర్చుకోవడం చాలామందికి అలవాటే. ఇందుకు కారణం వీలైనంత త్వరగా అప్పు తీసుకునే అవకాశం ఉండటమే. ఒకవేళ బ్యాంకులో పర్సనల్ లోన్‌కు అప్లై చేస్తే మూడు నాలుగు రోజుల ప్రాసెస్ ఉంటుంది. అదే గోల్డ్ లోన్ అయితే వెంటనే అప్రూవ్ అవుతుంది. గోల్డ్ లోన్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. పేపర్‌వర్క్ కూడా తక్కువ. అందుకే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటూ ఉంటారు. బ్యాంకులతో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు బంగారు నగలపై రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువ. అందుకే బంగారంపై రుణాలు తీసుకోవడానికే మొగ్గు చూపిస్తుంటారు.

    ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ కాలం. మీరు కూడా లాక్‌డౌన్ తర్వాత బంగారాన్ని తాకట్టుపెట్టి అప్పు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ కేవైసీ వివరాలన్నీ పక్కాగా ఉంటే కేవలం గంటలోనే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ప్యూరిటీ, తూకం చెక్ చేసిన తర్వాత గోల్డ్ వ్యాల్యూలో 75% వరకు లోన్ వస్తుంది. అంటే మీ నగల విలువ రూ.1,00,000 ఉంటే మీరు రూ.75,000 వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు 8.5% నుంచి 26% వరకు ఉంటాయి. బ్యాంకులు, సంస్థల్ని బట్టి ఇవి మారొచ్చు. ఇక కనీసం 18 క్యారట్ స్వచ్ఛత గల బంగారు నగలపై మాత్రమే రుణాలు లభిస్తాయి. నగలపై ఉన్న రాళ్లు, రత్నాలను లెక్కించకు. కేవలం బంగారు విలువను మాత్రమే లెక్కిస్తారు. కొన్ని సంస్థలు బంగారం బిస్కెట్లపై రుణాలు ఇవ్వవు. 99.99% స్వచ్ఛత గల కాయిన్స్‌పై రుణాలు తీసుకోవచ్చు.

    మీరు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకుంటే నగల దుకాణాలకు వెళ్లకపోవడమే మంచిది. అక్కడ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లోనే లోన్లు తీసుకోవాలి. మీ బంగారాన్ని ఎక్కువ లోన్ తీసుకోవచ్చు. రీపేమెంట్ పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. మీరు ఈఎంఐ ఎంచుకోవచ్చు. లేదా ఒకేసారి రుణం మొత్తం చెల్లించొచ్చు. కాకపోతే వడ్డీని ముందుగానే మినహాయించి రుణాలు ఇస్తాయి. అంటే మీకు రూ.50,000 రుణం మంజూరైతే వడ్డీ రూ.5,000 అనుకుంటే మీ చేతికి రూ.45,000 మాత్రమే వస్తాయి. లేదంటే మీరు వడ్డీని ఈఎంఐలా చెల్లించి చివర్లో అసలు చెల్లించి మీ నగలు విడిపించుకోవచ్చు. అందుకే మీ అవసరాలు, చెల్లించే స్తోమతను బట్టి రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

    ఇవి కూడా చదవండి:

    Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

    మీ అకౌంట్లోకి రూ.1500 రాలేదా? ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి

    SBI account: ఎస్‌బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ లాభాలు
    Published by:Santhosh Kumar S
    First published: