అత్యవసరంగా డబ్బులు కావాల్సినప్పుడు ఇంట్లో ఉన్న బంగారం ఆదుకుంటూ ఉంటుంది. బంగారాన్ని ఎప్పుడైనా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవచ్చు. పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ కూడా తక్కువ. బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్‌తో పాటు ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ లాంటి సంస్థలు కూడా అప్పులు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు మీరు అప్పు తీసుకునే బ్యాంకు లేదా సంస్థను బట్టి మారుతుంటాయి. మరి బంగారం తాకట్టుపెడితే ఏ బ్యాంకులో, ఏ ఫైనాన్స్ సంస్థలో ఎంత వడ్డీ చెల్లించాలో తెలుసుకోండి.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.40% నుంచి 9.15%
2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 10.50% నుంచి 15.95%
3. ఐసీఐసీఐ బ్యాంక్- 10.50% నుంచి 16.50%
4. యాక్సిస్ బ్యాంక్- 14.50% నుంచి 15.50%
5. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 11.75% నుంచి 12.75%
6. ముత్తూట్ ఫైనాన్స్- 12.00% నుంచి 24.00%
7. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్- 14.00% నుంచి 26.00%
బంగారం తాకట్టు పెట్టి రూ.10,000 నుంచి రూ.15,000 లక్షల వరకు వెంటనే లోన్ తీసుకోవచ్చు. 6 నెలల నుంచి 24 నెలల్లో అప్పు తిరిగి చెల్లించాలి. రెండు పాస్ పోస్ట్ సైజ్ ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. లోన్ అప్రూవల్ కోసం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్...రియల్మీ ఎక్స్2 ప్రో అద్భుతం
ఇవి కూడా చదవండి:
Loan: 59 నిమిషాల్లో అప్పు... ఏ లోన్ అయినా అప్లై చేయండిలా
Gold: బంగారు నగలు ఆన్లైన్లో కొంటే లాభమా? నష్టమా?
Gold: బంగారం 10% డిస్కౌంట్‌కే కొనొచ్చు ఇలా
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Bank loans, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rates, Gold shops, Hdfc, HDFC bank, Icici, Icici bank, Sbi, State bank of india