ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? బంగారాన్ని తాకట్టుపెట్టి గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు సవరిస్తూ ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బ్యాంకున్న బట్టి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఎక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో తెలుసుకొనడం మంచిది. లేకపోతే అనవసరంగా ఎక్కువ వడ్డీ చెల్లించక తప్పదు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉన్నాయి. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఈ వడ్డీ రేటు మారుతుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు కూడా అంతే. 2021 జనవరి నాటి లెక్కల ప్రకారం చూస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఈ వడ్డీ 13 శాతం వరకు ఉంటుంది. మరి ఏ బ్యాంకులో, ఫైనాన్సింగ్ సంస్థలో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి.
Gold Loan: ఈ విషయాలు తెలుసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకుంటే నష్టపోతారు
Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే
Gold Loan Interest Rates: గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఇవే...
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 7 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం
కెనరా బ్యాంక్- 7.65 శాతం
కర్ణాటక బ్యాంక్- 8.38 శాతం
ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం
యూకో బ్యాంక్- 8.50 శాతం
ఫెడరల్ బ్యాంక్- 8.50 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.85 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.05 శాతం
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్- 9.24 శాతం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.90 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం
ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం
ఎస్ బ్యాంక్- 10.99 శాతం
బజాజ్ ఫిన్సర్వ్- 11.00 శాతం
ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం
మణప్పురం ఫైనాన్స్- 12.00 శాతం
యాక్సిస్ బ్యాంక్- 13 శాతం
Gold Loan Vs Personal Loan: లోన్ తీసుకునే ముందు ఈ లెక్కలు మర్చిపోవద్దు
SBI Gold Loan: గోల్డ్ లోన్ స్మార్ట్ఫోన్లో తీసుకోవచ్చు... ఎలాగంటే
ఈ వడ్డీ రేట్లు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.50 శాతం వడ్డీ ఉంది.